దసరా రద్దీ.. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు

TG: బతుకమ్మ, దసరా పండుగల సందర్భంలో హైదరాబాద్లోని MGBS, జూబ్లీ బస్టాండ్లు ప్రయాణికులతో నిండిపోయాయి. సొంతూళ్లకు వెళ్లేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ పెరగడంతో బస్సుల కోసం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు, పండుగ రద్దీ రోజుల్లో ప్రత్యేక బస్సుల టికెట్ ధరలను సాధారణ ఛార్జీల కంటే 50 శాతం వరకు పెంచారు. అయితే, సాధారణ బస్సుల్లో టికెట్ ధరలు యథాతథంగా ఉంటాయని RTC తెలిపింది.
