← Back to news

గుంతలో పడ్డ బర్రె... తరువాత ఏమైంది?

By Srikanth· 1d ago· Jagitial

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గోడిసెలపేటలో ఉపాధి హామీ గుంతలో పడిపోయిన బర్రెను గ్రామస్తులు సురక్షితంగా బయటకు తీశారు. నిన్నటి నుంచి కనిపించకపోవడంతో ఓనర్ చింతల రవీందర్ ఫ్యామిలీ వెతగ్గా, గుట్ట ప్రాంతంలోని లోతైన గుంతలో చిక్కుకుని ఉన్నట్లు గుర్తించారు. వెంటనే లోకల్స్ రెస్క్యూ చేపట్టి బర్రెను కాపాడారు. ప్రమాదాలు జరగకుండా ఇలాంటి గుంతలను తక్షణమే పూడ్చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

More in Local