← Back to news

6 రోజులు వర్షాలు.. మరో అల్పపీడనం

By Krishna· 2h ago
6 రోజులు వర్షాలు.. మరో అల్పపీడనం

తూర్పు బంగాళాఖాతంలో ఈ నెలాఖరున మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉంది అని యూరప్ వాతావరణ సంస్థ చెబుతోంది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 1 వరకూ ఏపీ, తెలంగాణలో అక్కడక్కడా లైట్ రెయిన్ పడుతుంది అని IMD చెప్పింది. తెలంగాణలో సెప్టెంబర్ 26న, APలో 26 నుంచి 29 వరకూ అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, పిడుగులు పడతాయని తెలిపింది. ఒక వారం పాటూ రెండు రాష్ట్రాల్లో గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుందని అంచనా వేసింది.

More in Politics