వాగులో చిక్కుకున్న ముగ్గురిని కాపాడిన పోలీసులు

AP: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలంలోని నూతలవాగులో బొలెరో వాహనం ఉధృతంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహంలో చిక్కుకుంది. ప్రాణరక్షణ కోసం ఈ ప్రమాదంలో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులు ఆ ప్రవాహం పక్కనే ఉన్న చెట్టుపైకి ఎక్కి సహాయం కోసం కేకలు వేశారు. ప్రొక్లెయిన్‌తో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ముగ్గురిని సురక్షితంగా రక్షించారు. నల్లమలసాగర్ జలాశయానికి సొరంగాల ద్వారా కృష్ణాజలాలు భారీగా చేరుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.




