← Back to news

కోడి పందేలపై పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్ట్!

By Srikanth· 1d ago· Kannepalle, Chennur, Mancherial
కోడి పందేలపై పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్ట్!

మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం చింతపూడి లింగాల గ్రామ శివారులో కోడి పందేల స్థావరంపై పోలీసులు దాడి చేశారు. టాస్క్‌ఫోర్స్, కన్నెపల్లి పోలీసులు సంయుక్తంగా ఈ దాడి నిర్వహించారు. కోడి పందేలు, బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు కోళ్లు, రూ.2,100 నగదు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు నేతృత్వంలో ఈ దాడి జరిగింది. జూదం, బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.

More in Local