మండల అధ్యక్షుడిగా చెన్నయ్య ఏకగ్రీవం

TG: రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండల మాదిగ దండోరా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొందుర్గ్ మండల కేంద్రంలోని జీఎంఆర్ కన్వెన్షన్ హాల్లో మాజీ ఎంఆర్‌పీఎస్ మండల అధ్యక్షుడు అనేగాళ్ల ఆనంద్ మాదిగ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జిల్లా పరిశీలకుడు రావుగల్ల బాబు, మాజీ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆగిర్యాల గ్రామానికి చెందిన గూడెం చెన్నయ్యను మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.



