తెలంగాణ జైళ్ల శాఖకు SKOCH అవార్డు!

TG: ఢిల్లీలో 109వ SKOCH అవార్డ్స్ ఈవెంట్‌లో తెలంగాణ జైళ్ల శాఖకు అవార్డు దక్కింది. జైళ్లలో ఏర్పాటు చేసిన ‘నివృత్తి’ డీ-అడిక్షన్ సెంటర్లకు ఈ అవార్డు వచ్చింది. ఖైదీల్లో మత్తు పదార్థాల వాడకాన్ని తగ్గించడమే టార్గెట్‌గా ఈ ప్రోగ్రాం చేపట్టారు. ఇందులో భాగంగా 4,200 మంది ఖైదీలను స్క్రీనింగ్ చేయగా.. 2,126 మందికి WHO-ASSIST స్క్రీనింగ్, కౌన్సెలింగ్, ట్రీట్‌మెంట్ అందించారు. చికిత్సతో పాటు బిహేవియర్ చేంజ్, రిహాబిలిటేషన్, విడుదల తర్వాత సపోర్ట్‌పై ఫోకస్ చేశారు.

