వన్యప్రాణుల, పర్యావరణ పరిరక్షణపై కమిటీ సమావేశం

TG: తెలంగాణ శాసనసభ సచివాలయంలో 2026–27 సంవత్సరానికి ఏర్పాటు చేసిన వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చైర్మన్‌గా ఉన్న కమిటీలో వన్యప్రాణుల సంరక్షణ, అటవీ పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత, అడవుల అభివృద్ధిపై చర్చించారు. వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చర్యలను మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్యేలు సూచించారు.



