← Back to news

ప్రవక్త బోధనలు మానవాళికి మార్గదర్శకం

By @ Alam· 1d ago· Rompedu, Yellandu, Bhadradri Kothagudem
ప్రవక్త బోధనలు మానవాళికి మార్గదర్శకం

శాంతి, సేవ, సోదరభావమే ప్రవక్త మహమ్మద్ సందేశమని ముస్లిం మతపెద్దలు పేర్కొన్నారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం క్లబ్‌లో తెలంగాణ ముస్లిం ఐక్య సంఘం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి “జల్సా-ఏ-ఆమ్ సీరతున్నబీ” సభ నిర్వహించారు. “సమస్త మానవాళికి ప్రవక్త మహమ్మద్ సందేశం” అంశంపై జరిగిన సభలో ఉలేమాలు, మతపెద్దలు, యువత, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఖుర్‌ఆన్ పారాయణం, నాత్-ఎ-షరీఫ్‌తో కార్యక్రమం ప్రారంభమైంది. మౌలానా సల్మాన్ బిజ్నోరీ, డాక్టర్ హాఫిజుల్ రహమాన్, బ్రదర్ సిరాజ్, స్వామిలక్ష్మీ శంకరాచార్య తదితరులు ప్రసంగించారు.

ప్రవక్త బోధనలు మానవాళికి మార్గదర్శకం
ప్రవక్త బోధనలు మానవాళికి మార్గదర్శకం

More in Local