హోటల్ కిచెన్లలో బొద్దింకలు, ఎలుకలు: టిజి సేఫ్

TG: హైదరాబాద్‌లో హోటళ్లు, రెస్టారెంట్లపై టీజీ సేఫ్ అధికారులు తనిఖీలు చేశారు. గచ్చిబౌలిలో గర్ల్‌ఫ్రెండ్ మండీ, గోపనపల్లిలో శ్రీకృష్ణ ఫ్యామిలీ దాబా, వంటి హోటల్స్‌లో అపరిశుభ్ర వాతావరణం, బొద్దింకలు, ఎలుకలు, డ్రైనేజీ సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. కుళ్లిన కూరగాయలు, సరిగా నిల్వ చేయని ఆహార పదార్థాలను కూడా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. హోటళ్ల నుంచి ఆహార నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపారు. నిబంధనలు పాటించని నిర్వాహకులకు నోటీసులిచ్చారు.



