జైలు నుంచి రాగానే షారుఖ్ మీమ్‌తో అభిజీత్ పోస్ట్!

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఫౌండర్ అభిజీత్ దీప్కే జైలు నుంచి విడుదలయ్యాక షారుఖ్ ఖాన్ మీమ్‌తో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. 24 గంటల పాటు ఫోన్, వైఫై లేకుండా జైల్లో ఉండి బయటకు వచ్చాక ఎలా ఉంటుందో అంటూ ‘వీర్-జారా’ సినిమాలో షారుఖ్ ఫొటోను Xలో షేర్ చేశారు. మరో పోస్ట్‌లో జైల్లో ఉన్న తన సహచరులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా కూడా త్వరగా బయటకు రావాలని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. Peace Bond పై సంతకం చేసిన తర్వాత ఆయనకు షరతులతో కూడిన బెయిల్ లభించింది.



