← Back to news

చదివింది ఇంటర్.. రోగుల ప్రాణాలతో ఆటలు

By Vishi· 2h ago· Indiatoday
చదివింది ఇంటర్.. రోగుల ప్రాణాలతో ఆటలు

TG: వైద్య అర్హత లేకుండా డాక్టర్‌గా నటించి క్లినిక్ నడుపుతున్న 23 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నగరం గోల్కొండ ప్రాంతంలోని హిక్మా సెహత్ కేర్ సెంటర్‌ మొహమ్మద్ అద్నాన్‌ ఇంటర్ పూర్తి చేశాడు. తాతల కాలం నుంచి వచ్చిన హకీమ్‌గా చెప్పుకుంటూ లైంగిక సమస్యలు, శ్వాస సమస్యలు, ఛాతీ నొప్పి, కిడ్నీ సమస్యలకు ట్రీట్‌మెంట్ ఇస్తున్నాడు. దీంతో పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. 2023 నుంచి అద్నాన్ ఈ కేంద్రంలో పని చేస్తున్నాడని చెప్పారు.

More in TG