నర్సంపేట మెడికల్ కాలేజీకి పెద్ది పేరు!

కేటీఆర్ ప్రకటన.. వరంగల్ జిల్లా నర్సంపేట మెడికల్ కాలేజీ, జిల్లా ఆసుపత్రికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెడతామని BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో నర్సంపేట కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాగానే నర్సంపేటను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామన్నారు. పెద్ది కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.



