← Back to news

రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి చెంపదెబ్బ: కేటీఆర్

By Prashanth· 20h ago
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి చెంపదెబ్బ: కేటీఆర్

TG: దానం నాగేందర్ అనర్హత కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. హైకోర్టు ఇచ్చిన అనర్హత వేటును తప్పించుకునే ప్రయత్నం విఫలమైందన్నారు. పార్టీ ఫిరాయింపులతో ప్రజల తీర్పును మార్చాలని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చూశారని, స్పీకర్ నిర్ణయాన్ని అడ్డుపెట్టుకుని తప్పించుకోవాలని చూశారని విమర్శించారు. ఈ తీర్పు వారికి చెంపదెబ్బ లాంటిదన్నారు. ఖైరతాబాద్ ప్రజలు త్వరలో ప్రభుత్వ పాలనపై తీర్పు ఇస్తారని పేర్కొన్నారు.

More in TG