ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇచ్చిన ఎమ్మెల్యే
AP: తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు. మంగళవారం కూటమి నాయకులు, అధికారులతో కలిసి గ్రామంలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన ఎమ్మెల్యే నేరుగా పింఛన్ సొమ్మును అందజేశారు. మండలంలో కొత్తగా మంజూరైన వితంతు పింఛన్లను కూడా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ దశలవారీగా నెరవేరుస్తుందని అన్నారు.



