వర్షాభావంతో జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గింది

పులిచింతల జలవిద్యుత్ కేంద్రాన్ని Dy.CM భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, ఇప్పటివరకు జరిగిన ఉత్పత్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 20 వేల మెగావాట్లకు చేరినా గృహ వినియోగదారులకు 24 గంటల సరఫరా కొనసాగిస్తున్నట్లు భట్టి తెలిపారు. వర్షాభావంతో జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గినా థర్మల్, ఇతర వనరులతో అవసరాలు తీరుస్తున్నామని చెప్పారు.


