మద్యం అమ్మకాలపై ఒడిశా మహిళల ఆందోళన
ఒడిశాలోని నబరంగ్పూర్ జిల్లాను ఆల్కహాల్ ఫ్రీగా మార్చాలంటూ వేలాది మంది మహిళలు రోడ్డెక్కారు. జిల్లా నారీ మహాసంఘ ఆధ్వర్యంలో చమురియాగూడ స్క్వేర్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్రమంగా మద్యం అమ్మడం, పర్మిషన్ లేని షాపులు నడపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.మద్యంతో ఫ్యామిలీల్లో గొడవలు పెరుగుతున్నాయని అన్నారు. కలెక్టర్ మధుమితకు 10 డిమాండ్లతో వినతిపత్రం ఇచ్చారు. 15 రోజుల్లో చర్యలు తీసుకోకపోతే ప్రొటెస్ట్ను మరింత పెంచుతామని హెచ్చరించారు.


