← Back to news

🌱 16 వేల మొక్కలతో సస్య గణపతి!

By BK· 1d ago· అనకాపల్లి
🌱 16 వేల మొక్కలతో సస్య గణపతి!

అనకాపల్లి జిల్లా సిరసపల్లిలోని చింతామణి దత్తక్షేత్రంలో ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు 16 వేల మొక్కలతో వినాయక ప్రతిమను, మరో 60 వేల మొక్కలతో మండపాన్ని చేశారు. వినాయక చవితి సందర్భంగా MLA కొణతాల రామకృష్ణ పూజలు చేసి ఈ ‘సస్య గణపతి’ని భక్తుల దర్శనం కోసం ప్రారంభించారు. ఈ పచ్చని వినాయకుడు సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 4 వరకు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. మీరు కూడా మీ ఊరి మట్టి గణేశ్‌తో ఫొటోలు తీసుకొని మాకు పంపండి. మేం అందరికీ చూపిస్తాం.

More in Local