← Back to news

అతన్ని విడుదల చేయించండి ప్లీజ్!

By Vinith· 1h ago· Jagitial, Jagitial, Jagitial
అతన్ని విడుదల చేయించండి ప్లీజ్!

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ ప్రవాస కార్మికుడు కొత్తూరి రాజ్‌కుమార్ షార్జా ఎయిర్‌పోర్టులో అరెస్ట్ అయ్యారు. మార్చి 12న హైదరాబాద్ వెళ్లేందుకు విమానం ఎక్కుతుండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఫుజైరా జైలులో ఉన్నారు. ఆయన భార్య రజిత సీఎం ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం ఇచ్చారు. న్యాయసాయం అందించాలని కోరారు. నోడల్ ఆఫీసర్ కె. విద్యాసాగర్ స్పందించి.. GAD ఎన్నారై అధికారులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

More in Local