నిజం కోసం ప్రాణాలిచ్చిన కలం యోధుడు

నిజం కోసం నిర్భయంగా కలం పట్టిన తొలితరం పాత్రికేయుడు షోయబుల్లాఖాన్ జయంతి నేడు. 1920 అక్టోబర్ 17న జన్మించిన ఆయన నిజాం పాలనలో ప్రజల హక్కుల కోసం పోరాడారు. ‘ఇమ్రోజ్’ ఉర్దూ దినపత్రిక ద్వారా నిరంకుశ పాలనను ప్రశ్నిస్తూ, రజాకార్ల దౌర్జన్యాలను ఎండగట్టారు. 1948 ఆగస్టు 22న రజాకార్ల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. షోయబుల్లాఖాన్ జీవితం నేటి స్ఫూర్తిదాయకమని, ఆయన జయంతి సందర్భంగా పత్రికా స్వేచ్ఛ, వృత్తి నిబద్ధతను స్మరించుకోవాలని ఖమ్మం జిల్లా పలువురు పేర్కొంటున్నారు.



