నేడు వెన్నముద్దల బతుకమ్మ

తెలంగాణలో ఈరోజు వెన్నముద్దల బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. బతుకమ్మ పండుగలో ఎనిమిదో రోజైన ఆశ్వయుజ శుద్ధ సప్తమి సందర్భంగా గౌరమ్మకు వెన్నముద్దలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజున చేమంతి, గునుగు, గులాబీ, తంగేడు వంటి పూలతో బతుకమ్మను అందంగా పేర్చి పూజిస్తారు. వెన్న, నెయ్యి, నువ్వులు, బెల్లంతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెడతారు.
