విజ్ఞాన విహార్ స్కూల్లో అక్షరాభ్యాసం
గుంటూరు జిల్లా మంగళగిరి నూతక్కిలోని విజ్ఞాన విహార్ స్కూల్లో పిల్లల కోసం అక్షరాభ్యాసం ప్రోగ్రామ్ నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపాల్ సురేష్ పాల్గొని పిల్లలతో అక్షరాభ్యాసం చేయించాక, అందరికీ పలకలను డిస్ట్రిబ్యూట్ చేశారు. స్టూడెంట్స్లో చదువుపై ఇంట్రెస్ట్ పెంచి వారి విద్యాభ్యాసానికి తొలి అడుగు వేసేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులు అక్షరాలు రాయడం స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది.



