← Back to news

ఉద్యోగులకు 3 డీఏలు ఓకే!

By A.Ajay· 1d ago
ఉద్యోగులకు 3 డీఏలు ఓకే!

TG: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఆరు DAల్లో మూడు DAలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ఇందులో రెండు DAలను త్వరలో విడుదల చేసి మూడో DAను సంక్రాంతికి ఇస్తామని ప్రభుత్వం చెప్పినట్లు సమాచారం. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన 10 వేల కోట్ల పాత బకాయిలను వచ్చే మార్చి నాటికి చెల్లిస్తామని తెలిపినట్లు సంఘాలు పేర్కొన్నాయి. PRC నివేదికను 15 రోజుల్లో తెప్పించి, అమలుపై నిర్ణయం తీసుకుంటామని CPS పై కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పినట్లు తెలిపాయి.

More in TG