← Back to news

మార్కెట్ యార్డు ముందు రైతుల ధర్నా

By DK· 1d ago
మార్కెట్ యార్డు ముందు రైతుల ధర్నా

నిర్మల్ జిల్లా భైంసా వ్యవసాయ మార్కెట్ యార్డులో e-NAM సర్వర్ సమస్య, సోయాబీన్‌కు తక్కువ ధరలు పలకడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట విక్రయానికి తీసుకొచ్చినా సర్వర్ సమస్యతో బీట్ నిర్వహణలో జాప్యం జరగడంతో అధికారులు ఓపెన్ ఆక్షన్ ద్వారా వేలం నిర్వహించారు. అయితే సోయాబీన్‌కు సరైన ధర రావడంలేదని ఆరోపిస్తూ రైతులు మార్కెట్ యార్డు ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకుని సర్ది చెప్పారు.

More in Lifestyle