పట్టణ జీవనోపాధి స్కీమ్కు బ్రేక్!

నగరాల్లో పేదలకు ఉపాధి, ఆర్థిక సాయం అందించే DAY-NULM స్కీమ్ 2024 సెప్టెంబర్లో ముగిసింది. దీని స్థానంలో కొత్త స్కీమ్ తీసుకొస్తారని గతంలో వార్తలు వచ్చినా, ఇప్పటికీ పూర్తి క్లారిటీ లేదు. తాజాగా తమిళనాడు, కర్ణాటక సహా ఐదు రాష్ట్రాలు ఈ పథకానికి నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరాయి. ఈ స్కీమ్ ద్వారా మహిళల స్వయం సహాయక సంఘాలు, నిరుద్యోగులు, వీధి వ్యాపారులకు సాయం అందేది. కొత్త స్కీమ్పై కేంద్రం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.


