ప్రభుత్వ బడులపై TPF అవగాహన

TG: TPF చేస్తున్న <a href="https://www.theclearcutnews.com/n/dros86J">బస్సు యాత్రలో</a> భాగంగా వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో ప్రభుత్వ బడుల పరిస్థితిపై మాజీ IAS ఆకునూరి మురళి స్థానికులకు అవగాహన కల్పించారు. కార్పొరేట్ స్కూల్స్‌తో పోలిస్తే ప్రభుత్వ బడుల్లో వసతులను గమనించాలని సూచించారు. ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ తరహాలో రాష్ట్రంలో 2 వేల స్కూల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులకు బస్ సౌకర్యం, డైనింగ్ టేబుల్స్ వంటి బేసిక్ ఫెసిలిటీస్ కల్పించాలని కోరారు. ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు.



