నలుగుతున్న నాలుగో సింహం

TG: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రి, నియోజకవర్గ ఇన్చార్జి మధ్య ఆధిపత్య పోరు పోలీసు అధికారులకు ఇబ్బందిగా మారింది. ఓ మహిళ హత్య కేసులో నిందితుడిపై ముందే కంప్లయింట్ చేసినా కేసు నమోదు కాలేదనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో SP సస్పెన్షన్, CI బదిలీ, డివిజన్ స్థాయి అధికారికి మెమో ఇవ్వడం చర్చకు దారితీసింది. రాజకీయ ఒత్తిళ్లతో పోలీసుల పనితీరుపై ప్రభావం పడుతోందనే విమర్శలు ఉన్నాయి. కేసుల విచారణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులకు రాజకీయ పరిణామాలు సవాలుగా మారుతున్నాయి.
