స్వతంత్ర భరద్వాజ్‌కు ఇంటెరిమ్ బెయిల్!

ఢిల్లీ కోర్టు.. స్వతంత్ర భరద్వాజ్‌కు ఇంటెరిమ్ బెయిల్ ఇచ్చింది. రెగ్యులర్ బెయిల్ కోసం అతని ప్రవర్తనను గమనించాలని తెలిపింది. కేసు గురించి SMలో పోస్ట్‌లు పెట్టకూడదని నిషేధం విధించింది. పోలీసు విచారణలో లోపాలు ఉన్నాయని కోర్టు గమనించింది. 10 రోజులుగా జైల్లో ఉన్న భరద్వాజ్‌కి తప్పు తెలుసుకునే సమయం దొరికిందనీ, కస్టోడియల్ విచారణ పూర్తయిందని కోర్టు తెలిపింది. ఢిల్లీ.. జంతర్‌మంతర్ దగ్గర CJP ప్రొటెస్ట్ చేసినప్పుడు, విద్యార్థిని నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌పై దాడి చేసిన కేసులో భరద్వాజ్ అరెస్ట్ అయ్యాడు.


