← Back to news

బైక్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. ఇద్దరు మృతి

By KUCHIPUDI BUJJIBABU· 1d ago· Bhadravathi Nagar, Mangalagiri, Guntur
బైక్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. ఇద్దరు మృతి

AP: వినాయక చవితి పండుగ రోజే పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రొంపిచర్ల మండలంలోని కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ రహదారిపై సోమవారం ట్రావెల్స్ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. నరసరావుపేట నుంచి రొంపిచర్ల వైపు వెళ్తున్న బైక్ చెక్‌పోస్టు వద్ద రోడ్డు దాటుతుండగా.. హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తున్న శ్రీ లక్ష్మీ నరసింహ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

More in Local