నేడు వేపకాయల బతుకమ్మ

తెలంగాణలో బతుకమ్మ వేడుకల్లో ఏడో రోజైన వేపకాయల బతుకమ్మను ఈరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహిళలు చామంతి, గునుగు, రుద్రాక్ష తదితర పూలతో ఏడు ఎత్తుల్లో బతుకమ్మను పేర్చి, గౌరమ్మను ప్రతిష్ఠిస్తారు. బియ్యప్పిండిని వేయించి, బెల్లం కలిపి వేపకాయల ఆకారంలో తయారు చేసిన వంటకాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ప్రత్యేక నైవేద్యం వల్లే ఈ రోజుకు వేపకాయల బతుకమ్మ అనే పేరు వచ్చింది.
