10 మంది పూజార్ల నియామకం

తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో TTD ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 10 మంది వేద పండితులకు నియామక పత్రాలు అందజేశారు. నిడదవోలు నియోజకవర్గంలో 80 ప్రాచీన ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. పూజారులకు అవసరమైన వసతి, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.



