← Back to news

మట్టి వినాయకుడినే పూజిద్దాం

By DK· 1d ago
మట్టి వినాయకుడినే పూజిద్దాం

TG: పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ లక్ష్యంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 2,000 మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. మాధురి మధు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సత్తుపల్లి ఆర్టీసీ డీఎం లక్ష్మీనారాయణ ప్రారంభించి విగ్రహాలను పంపిణీ చేశారు. గత తొమ్మిదేళ్లుగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తూ పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నట్లు మాధురి మధు తెలిపారు. కెమికల్స్‌తో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు.

More in Local