ఇది ఒక్కరి గొంతు కాదు.. భారత ప్రజల గొంతు: రాహుల్ గాంధీ
దేశంలో జరుగుతున్న నిరసన ఒక్కరి గొంతు కాదు.. ఇది భారత ప్రజల గొంతు అని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ నిరసనలో హిందూ, ముస్లిం, కులం, ఆడ, మగ అనే తేడాలు లేవని, అందరిదీ ఒకే గొంతు అని చెప్పారు. ఈ గొంతుకు ప్రధాని మోదీ, అమిత్ షా వ్యతిరేకంగా నిలవొద్దని సూచించారు. నిరసనకు సంబంధించిన వీడియో ప్రూఫ్స్ భద్రపరచాలని స్టూడెంట్స్కు పిలుపునిచ్చారు. పిల్లలపై చేయి చేసుకున్న పోలీసులతో పాటు బాధ్యులైన నేతలపైనా యాక్షన్ తీసుకునేలా చూస్తామని హెచ్చరించారు.


