రీసర్వే పనులకు డెడ్లైన్.. ఆదేశాలు!

అల్లూరి జిల్లాలో రీసర్వే పనులపై పాడేరు కలెక్టరేట్లో ప్రాంతీయ సంయుక్త సంచాలకులు సీహెచ్.వి.ఎస్.ఎన్. కుమార్ సమీక్షించారు. సీఎం నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. రోజువారీ పురోగతిని టీమ్ల వారీగా నమోదు చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే టీమ్లదే బాధ్యతని స్పష్టం చేశారు. రికార్డుల నిర్వహణ, నాణ్యతా తనిఖీలు, అప్పీల్ పిటిషన్ల పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు.



