ఎయిర్ ఇండియా ఫ్లైట్కు ఎమర్జెన్సీ అలర్ట్!

ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 2030కు సెక్యూరిటీ అలర్ట్ రావడంతో జైపూర్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో 250 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులు, సిబ్బందిని కిందకు దించారు. ప్రస్తుతం అధికారులు విమానం, లగేజీని చెక్ చేస్తున్నారు. మొదట బాంబు బెదిరింపుగా వార్తలు వచ్చినా, హైజాక్ అలర్ట్ వచ్చిందనే రిపోర్టులు కూడా ఉన్నాయి. అసలు ఏం జరిగిందనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.


