← Back to news

పాకిస్తానీ పైలట్లపై నిషేధం

By A.Ajay· 3h ago· Indiatoday
పాకిస్తానీ పైలట్లపై నిషేధం

ఫ్లెదుబాయ్ విమాన ఘటన సందర్భంలో ఎయిర్ ఫ్రాన్స్ విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ కు రాకపోకలు సాగించే తమ విమానాల్లో పాకిస్తానీ పైలట్లు, క్యాబిన్ సిబ్బందిపై ఎయిర్ ఫ్రాన్స్ నిషేధం విధించింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఏ దేశానికైనా విమానాలు నడిపేటప్పుడు ఆయా దేశాల చట్టాలను పాటించాల్సి ఉంటుందని.. ఇందులో భాగంగానే ఇజ్రాయెల్ జారీ చేసిన నూతన భద్రతా ఆదేశాలకు కట్టుబడి పాకిస్తాన్ పైలట్లు, క్యాబిన్ సిబ్బందిని ఇజ్రాయెల్ రూట్లలో నడిచే విమానాల్లో నియమించబోమని ఎయిర్ ఫ్రాన్స్ స్పష్టం చేసింది.

More in International