విద్యార్థిని అలీనా కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

TG: పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న విద్యార్థులపై చెట్టు కొమ్మ విరిగిపడిన ఘటనలో ఓ విద్యార్థిని మృతి చెందడం విషాదం నింపింది. యాదాద్రి జిల్లా భువనగిరి భగాయత్ జడ్పీ పాఠశాలలో ఈ ప్రమాదం జరిగింది. బలమైన గాలులకు భారీ వేపచెట్టు కొమ్మ ఒక్కసారిగా విరిగి విద్యార్థులపై పడటంతో ఏడుగురు గాయపడ్డారు. వారిలో అలీనా అనే విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అలీనా కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించారు.





