పట్టించుకోని సర్కార్.. ఇబ్బందుల్లో పిల్లలు

TG : రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం బైరంపల్లి గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్ బాగా పాడైపోయింది. 10 ఏళ్లుగా స్కూల్ పరిస్థితి దారుణంగా ఉన్నా ఎవరూ కేర్ తీసుకోలేదు. కొత్త బిల్డింగ్ కడతామని గత ప్రభుత్వం ఇచ్చిన ప్రామిస్ నెరవేరలేదు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా స్కూల్ వైపు చూడట్లేదని ఊరి జనం బాధపడుతున్నారు. రోజూ కూలీ పనులు చేసుకునే వాళ్లు, ఫెసిలిటీస్ లేక అప్పులు చేసి మరీ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లకు పంపాల్సి వస్తోంది. ఇప్పటికైనా గవర్నమెంట్ స్కూల్ ని బాగుచేయాలని కోరుతున్నారు



