పోటీ పరీక్షలకు పట్టుదలతో చదవాలి

TG: పోటీ పరీక్షలకు పట్టుదలతో చదివి యువత ఉన్నత ఉద్యోగాలు సాధించాలని తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు డా. నేవూరి ధర్మేందర్ రెడ్డి సూచించారు. యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్‌లో SNR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ మాదిగ ప్రైవేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సహకారంతో జరిగిన కార్యక్రమంలో ధర్మేందర్ రెడ్డి పుస్తకాలను అందజేశారు. కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయన్నారు.
