గంజాయి కబురు చెబితే.. రూ.1500 రివార్డు!

NTR జిల్లా పోలీసులు డ్రగ్స్‌పై వార్ ప్రకటించారు. 'ఈగల్ ఛాలెంజ్' పేరుతో కొత్త కార్యక్రమం మొదలుపెట్టారు.<br>గంజాయి తాగేవాళ్ల గురించి Info ఇస్తే రూ.1,500 రివార్డు ఇస్తామని సీపీ రాజశేఖర్ బాబు ప్రకటించారు.<br>అంతేకాదు, డ్రగ్స్ అమ్మకాలు, అక్రమ రవాణాపై క్లూ ఇస్తే రూ.5,000 వరకు ఇస్తామని చెప్పారు. ఇప్పటికే 1,287 మందిని పోలీసులు గుర్తించారు. ఇక ముందు విద్యాసంస్థల్లో స్పెషల్ టీములు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు.<br>డ్రగ్స్ నుంచి యువతను కాపాడాలని, మత్తురహిత సమాజం కోసం ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.



