బతుకమ్మ ఘాట్ పనుల తనిఖీ.. ఎంపీడీవో ఆదేశాలు!

జగిత్యాల జిల్లా, మెట్ పల్లి మండలంలోని మెట్ల చిట్టాపూర్లో నూతన బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులను ఎంపీడీవో మహేందర్ రెడ్డి గురువారం పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, లోపాలు లేకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ అరుణ గంగాధర్, ఏపీఓ లక్ష్మయ్య, ఉప సర్పంచ్ బంటు నారాయణ, పంచాయతీ కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు.



