చవితికి పోలీస్ రూల్స్
చవితికి పోలీస్ రూల్స్ తప్పక పాటించండివినాయక చవితి పండగను ప్రశాంతంగా జరుపుకోవాలని నిర్మల్ జిల్లా ముధోల్ సర్కిల్ CI రవీందర్ నాయక్ కోరారు. మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసులకు సమాచారం ఇచ్చి ఇంటిమేషన్ ఫామ్ లింక్ నింపాలన్నారు. ఊరేగింపులో కరెంట్ వైర్లు జరిపేటప్పుడు రబ్బర్ కర్రలు, ప్లాస్టిక్ గ్లౌజులు వాడాలని సూచించారు. రాత్రివేళ మండపాల దగ్గర ముగ్గురు సెక్యూరిటీగా ఉండాలని, నిమజ్జనం వరకు అందరూ శాంతిభద్రతలకు సహకరించాలని చెప్పారు.
