డ్యూటీలో ఉండగానే కుప్పకూలిన ఫైర్ ఆఫీసర్

TG: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ అగ్నిమాపక కేంద్రంలో ఫైర్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న MD షఫీ విధుల్లో ఉండగానే గుండెపోటుతో మృతి చెందారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆయన ఇచ్చోడలో డ్యూటీలో ఉండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చి కుప్పకూలాడు. గమనించిన తోటి సిబ్బంది హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. నిబద్ధతతో పనిచేసే అధికారి విధుల్లో ఉండగానే ఇలా అకస్మాత్తుగా కన్నుమూయడం పట్ల తోటి అగ్నిమాపక సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.



