అవంచలో అరుదైన ఏకశిలా గణపతి

TG: నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచ గ్రామంలోని అరుదైన ఏకశిలా గణపతి భక్తులను ఆకట్టుకుంటోంది. దుంధుభి నది ఒడ్డున సుమారు 34 అడుగుల ఎత్తైన శిలపై ఒకే రాతి ఖండంలో చెక్కిన భారీ గణపతి విగ్రహం శిల్పకళా నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ విగ్రహం చాళుక్యుల కాలం, సుమారు 12వ శతాబ్దానికి చెందినదిగా స్థానికంగా చెబుతున్నారు. ప్రకృతి అందాల మధ్య ఉన్న ఈ క్షేత్రానికి గణపతి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.
