నేచర్ లవర్స్‌కు గుడ్ న్యూస్..

గోదావరి నదిలో బోటు ప్రయాణం చేస్తూ, చుట్టూ కనిపించే పచ్చని కొండలు, ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశం మళ్లీ రానుంది. భద్రాచలం నుంచి పాపికొండలు, పేరంటాలపల్లి వెళ్లే టూర్‌ను తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. APలోని పోచవరం ఫెర్రీ పాయింట్ నుంచి సోమవారం బోట్లు నడిపే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. చింతూరు ITDA PO చిట్టపల్లి నరేంద్రపడాల్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు



