నీటి లభ్యతకు అనుగుణంగా పంటలు వేయాలి

వర్షాభావ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటి వనరులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని గద్వాల జిల్లా గట్టు మండలంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రైతులకు సూచించారు. విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని కోరారు. మండల పరిధిలో రూ.60 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. లింగాపురంలో రూ.30 లక్షలతో వ్యవసాయ గోదాం, రూ.10 లక్షలతో మహిళా సమాఖ్య భవనం, మల్లంపల్లిలో రూ.10 లక్షలతో మహిళా సమాఖ్య భవనం, మరో రూ.10 లక్షలతో ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులను ప్రారంభించారు.
