అవి ప్రజాస్వామ్యంపై దాడులే..
అన్నమయ్య జిల్లా పుంగనూరు ఘటనలపై YCP చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకటే గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలమనేరు మాజీ ఎమ్మెల్యే అయిన ఆయన... జరిగిన దాడులను ఖండించారు. MP పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై దాడి ప్రజాస్వామ్యంపై దాడి అన్నారు. నామినేషన్ల స్వీకరణలో అధికారులు ఇబ్బందులు కలిగించారని పేర్కొన్నారు. దాడుల్లో పలువురికి గాయాలయ్యాయని, వాహనాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. ముందస్తు ఫిర్యాదులు చేసినా పోలీసులు స్పందించలేదని విమర్శించారు. ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



