బషీరాబాద్ ఏఎంసీ చైర్మన్కు ఘన సన్మానం

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ ఏఎంసీ చైర్మన్ శంకరప్పను రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఎన్. బాలకృష్ణ, రిటైర్డ్ టీచర్ ఆనంద్, రిటైర్డ్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి వెంకటయ్య ఏఎంసీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. పీఏసీఎస్ డైరెక్టర్ బాలకృష్ణ పాల్గొన్నారు. శంకరప్పకు శుభాకాంక్షలు తెలిపి ఆత్మీయంగా సత్కరించారు. తనను సన్మానించిన వారికి శంకరప్ప ధన్యవాదాలు తెలిపారు.



