← Back to news

నాగర్‌కర్నూల్ ఇన్‌చార్జిగా సాయిబాబు

By anthati balu· 16 Aug 2026· Nagarkurnool (Ct), Nagarkurnool, Nagarkurnool
నాగర్‌కర్నూల్ ఇన్‌చార్జిగా సాయిబాబు

TG: ఆధార్ పార్టీ నాగర్‌కర్నూల్ అసెంబ్లీ ఇన్‌చార్జిగా గోవిందు సాయిబాబును నియమించింది. తెల్కపల్లి మండలం గౌరారం గ్రామానికి చెందిన గోవిందు సాయిబాబును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈదా శేషగిరిరావు (ESR) నియమించినట్లు హిమాయత్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.

More in Local