ఎన్నికల్లో పిల్లలను వాడటంపై చర్చించాలి: మద్రాస్ హైకోర్టు

ఎలక్షన్ల టైంలో పిల్లలను రాజకీయ ప్రచారంలోకి తీసుకురావడం, ఫలానా వారికి ఓటు వేయమని తమ కుటుంబ సభ్యులపై ఒత్తిడి చేసేలా చేయడం అనైతికమని, ఇది దేశం, పార్లమెంటు స్థాయిలో చర్చించాల్సిన అంశమని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత సీఎం జోసెఫ్ విజయ్ చేసిన పిలుపును ఉదహరిస్తూ కామెంట్స్ చేశారు. తన పార్టీ అభ్యర్థులకు ఓటు వేయమని కుటుంబ సభ్యులను ఒత్తిడి చేయాలని పిల్లలను విజయ్ కోరినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కోర్టు రియాక్ట్ అయ్యింది.


